తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి – ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సి కోదండరాం

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి

– ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సి కోదండరాం

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 12, అద్దం న్యూస్ :   ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సి కోదండరాం లు అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ( TU JAC ) ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా టియు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గద్దర్ కుమారుడు సూర్యం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకులు మాందాల భాస్కర్, టివి యూవి అధ్యక్షుడు కంచర్ల భద్రి, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆజాద్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అధ్యక్షుడు గోధుమలు కుమార స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకాల సమస్యలు పరిష్కరించాల్సి ఉండేదని, ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యమకారులు రోడ్డున పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రం సిద్ధించిందని, ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు దక్కాలని తెలిపారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధనలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన హక్కులను సాధించుకునే దిశగా ఉద్యమకారులు మరో ఉద్యమం చేస్తున్నారన్నారు. అమర వీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని, ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్య‌మ‌కారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 250 గజాల స్థలం ఇచ్చి వారికి అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి వ్యవస్థపక అధ్యక్షుడు గుండా యాదగిరి, పాండు, టియు జెఏసి వైస్ చైర్మన్ భోగే పద్మ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవి, డోలాక్ యాదగిరి, బాబన్న, కె.రాజేంద్రప్రసాద్, మోత్కూర్ మల్లేశం, జి.యాదగిరి, గుండమల్ల శ్రీను, గాజుల యాదగిరి, లలిత, అశోక్ రాబర్తి, చిలుక శారదా, దేవక్క, విజయలక్ష్మి, గందమల్ల శ్రీనివాస్, పి.జయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page