రెండేళ్ల సుధీర్ఘ పోరాట ఫలితం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 7, అద్దం న్యూస్ : రెండేళ్ల సుధీర్ఘ పోరాట ఫలితం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు అయ్యాయని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. వివేకానందనగర్ బస్తీవాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు అయ్యాయని, అందుకు జిల్లా కలెక్టర్ ఆమోదించారని తెలిసి బస్తీలో శనివారం సంబురాలు జరుపుకున్నారు. ఈ సంబురాలకు ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజరై బస్తీ వాసులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… గాంధీనగర్ డివిజన్ లోని శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీవాసుల ఇళ్లను గత 2 ఏళ్ల క్రితం అధికారులు నిర్ధాక్షణంగా కూల్చివేసిన నాటి నుండి బస్తీవాసులతో కలిసి చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. రెండేళ్లుగా బాధితులకు అండగా ఉంటూ, అనేక సార్లు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ చుట్టూ తిరిగిన అనంతరం బిజెపి ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ప్రత్యేక చొరవతో, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సహకారంతో ఎట్టకేలకు బాధితులకు డబుల్ బెడ్ ఇళ్లు మంజూరు కావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
వరుసగా కలెక్టర్‌తో సమీక్షిస్తూ, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇళ్ళు మంజూరు చేయించిన అనంతరం శనివారం కలెక్టర్ ఆమోదంతో, ముషీరాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాల ప్రోసీడింగ్ ప్రక్రియను బస్తీ వాసులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజా ప్రతినిధుల ప్రోటోకాల్ ప్రకారం, కలెక్టర్, ఇతర అధికారుల సమక్షంలో సమక్షంలో వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలు అందించనున్నామని కార్పొరేటర్ పావని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీ అధ్యక్షుడు ఎన్.ఎల్లమ్, ఎంబి.కృష్ణ, నందు, జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు, బలరాజ్, ఎల్లమ్మ, జయలక్ష్మి, అన్నపూర్ణ, సువర్ణ, భారతి, కన్యాకుమారి, బస్తీ వాసులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply