హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : సమసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైనదని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కృష్ణవేణి స్టాలిన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్‌లో గురువారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వక్తలు పాల్గొన్నారు. మొదట సావిత్రి బాయి, రమబాయి ఫోటోలకు నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. స్త్రీలను గౌరవించవలసిన అవసరం అందరిపైన ఉన్నదని అన్నారు. ఆ తర్వాత వివిద రంగాలలో సేవలందిస్తున్న సుమారు 24 మంది మహిళా నాయకులను జ్ఞాపికలతో, శాలువా, పూలదండలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌సిఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు రాగాల నాగేశ్వర్ రావు, ముఖ్య ప్రధాన కార్యదర్శి శ్యామ్ లేట్ నర్సింహారావు,ఎస్‌సిఆర్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డి.సుదర్శన్ బాబు, సలహా దారుడు రాయల నర్సింహా రావు, జాతీయ మహిళా అధ్యక్షురాలు జి.ఎస్. వీణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి స్టాలిన్, నగర అధ్యక్షులు గుంటి విజయ్ బాబు, కుర్మ మహేందర్, బట్టు కృష్ణ, రాపాక అశోక్, నిమ్మ నాగలక్ష్మి, గోకెర కవిత, పుష్పలత, సంగం మహేష్, పోతరాజ్ ప్రకాష్, వినయ్‌కుమార్, మొద్దు రేణుక, ఆలేటి బాలమణి, రాగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply