Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalగోశాలలో గోమాతలకు ఎంతో సేవకరమైన గరుకు స్థంభ స్థాపన

గోశాలలో గోమాతలకు ఎంతో సేవకరమైన గరుకు స్థంభ స్థాపన

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ :  వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డాన్ టు డస్క్ ఉదయాస్తమాన సేవల కార్యక్రమాలలో భాగంగా శ‌నివారం వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వ‌ర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లో గల నవగ్రహ పంచముఖ ఆంజనేయ స్వామి మహా శివాలయం గోశాలలో గోమాతలకు ఎంతో సేవ కరమైన గరుకు స్థంభ స్థాపన కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆలయ పండితులు ఉదయ్ శర్మ వేదమంత్రాలతో పూజలు జరిపించి సికింద్రాబాద్ వాసవి క్లబ్ పెద్దలు, ఆలయ కమిటీ వారి సమక్షంలో ప్రతిస్థాపన జరిపించారు. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో వాసవి క్లబ్ పెద్దలు ముఖ్య అతిథిగా అన్నం సాయి సునీత, గౌరవ అతిథిగా పల్లా నరేందర్, రీజినల్ చైర్మన్ పొట్టిముత్తు జగన్, రీజన్ సెక్రెటరీ కిషోర్ మాన్సాని, క్లబ్ ప్రెసిడెంట్ మరిపల్లి సుధన్వా, సెక్రటరీ తాడిశెట్టి వెంకటేష్, కోశాధికారి దినేష్ ఎరుకుల, పూర్వ అధ్యక్షుడు ఉపేందర్, మహేష్, ప్రేమ్ కుమార్, రత్నం, సురేష్, నారేశ్వర రావు, సుబోధ గుప్తా, ఉమామహేశ్వరరావు, బోర్డ్ మెంబర్స్, క్లబ్ సభ్యులు కేశవరాజు, వెంకటేష్, ప్రవీణ్, నవీన్, శ్రీ శివాలయ గోశాల నిర్వాహకులు చిరికలి గోపాల్ గురుస్వామి, భక్తులు తోలుపునూరి రమేష్, మనోజ్ గుప్తా, గోమాత గరుకు స్థంభ‌ దాతలు బచ్చు మహేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page