అర్హులైన వారు త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాలి – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌క‌లు జావీద్ ఖాన్‌, ఇమ్రాన్ ఖాన్‌

అర్హులైన వారు త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాలి
– బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌క‌లు జావీద్ ఖాన్‌, ఇమ్రాన్ ఖాన్‌

హైదరాబాద్, డిసెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    18 ఏళ్ల వ‌య‌స్సు నిండిన వారు త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌క‌లు జావీద్ ఖాన్‌, ఇమ్రాన్ ఖాన్ లు కోరారు. ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మాన్ని వారు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం బ‌త‌కాలంటే 18 ఏళ్లు నిండిన యువ‌తీ, యువ‌కులు ఆలోచించాల‌న్నారు. త‌మ ఓటును త‌ప్ప‌నిస‌రి న‌మోదు చేసుకోవాల‌న్నారు. అలాగే ఓటరు కార్డులో పేర్లు త‌ప్పుగా ఉన్నా, ఇంటి అడ్ర‌స్సులు మారినా స‌వ‌రించుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ అహ్మదుల్లా భక్తియారీ, ఇమ్రాన్ ఖురేషి, ఎండి.మొహియుద్దీన్, జునైద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page