గాంధీ పేరు వాడుకునే వారే తెలంగాణాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, అక్టోబర్ 7, అద్దం న్యూస్ : గాంధీ వారసులమని, గాంధీజీ చూపిన బాటే మాకు మార్గదర్శకమని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, చీటికి మాటికి గాంధీ పేరు వాడుకునే కాంగ్రెస్ నాయకులు తెలంగాణాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 3 వేల కోట్ల మద్యం అమ్మకాలతో రికార్డు సృష్టించారని… 3 వేల కోట్ల మధ్యం అమ్ముడు పోయిందంటే త్యాగాల తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కూడా తెలంగాణను మత్తులో ముంచి నిరాటంకంగా దోపిడీ చేశారని.. దానికి మించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏలా పడితే ఆ విధంగా దోచుకుని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుందన్నారు. తెలంగాణను పూర్తిగా మత్తులో ముంచే ప్రయత్నాలు చేస్తున్నదని, ఇటీవల జరిగిన మద్యం షాపుల టెండర్లలో ఒక్కొక్క దుకాణానికి 3 లక్షల రూపాయల నాన్ రిఫెండబుల్ డిపాజిట్ వసూలు చేసి అమ్మకాలకు నిర్దేశించి టార్గెట్లు పెట్టడం, చీటికి మాటికి మద్యం ధరలు పెంచడం చూస్తే ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకున్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.
సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కి, తులం బంగారమన్నారు. మహిళలకు 1500 రూపాయల నెలకు చొప్పున ఇస్తామని.. ఏది లేదన్నారు. ఉచిత గ్యాస్ పంపిణి లేదు… ఉచిత కరెంట్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు… కాని చేసిందేమీ లేదన్నారు. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి కొత్తగా మద్యం ద్వారా తెలంగాణను దిగజార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు నాసిరకం బోసిరికమో దసరాకు ఇచ్చింది… కానీ కాంగ్రెస్ పార్టీ దానికన్నా గొప్పగా ఇస్తామని చెప్పి దసరా అయిపోయి పది రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు ఇందిరమ్మ వర్ధంతి రోజున ఇస్తామంటూ ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఆమె చనిపోయిన రోజున కానుక ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. ప్రతిదానికి ఇందిరమ్మ పేరు తీసుకొచ్చే కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ పై అంతగా ప్రేమ ఉంటే వాళ్ళ కూతుర్లకు కొడుకులకు పేర్లు పెట్టుకోవాలన్నారు. తప్ప ప్రతి దానికి ఇందిరమ్మ అని నామజప చేయడం మంచి పద్ధతి కాదని… పాడిందే పాట పాసు పళ్ల దాసరి అన్నచందంగా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు తీసుకురావడం మర్చిపోవాలని, ఇందిరమ్మ పేరు చెప్పి వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యమైన పనులకు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రజల్ని వంచించిన తిరిగి అధికారంలోకి రావడం కల్ల అన్నారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు లబోదిబోమంటున్నా పట్టించుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. చాలా మంది విద్యార్థులు తమ చదువు మధ్యలో ఆపివేసిన సంఘటనలెన్నో ఉన్నా వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధిపొందాలనే దృష్టితో బీసీల నామజపం చేస్తుందన్నారు. వంద సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఇంత కాలం బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కల్పించలేకపోయిందని ప్రశ్నించారు. ఇవన్నీ కేవలం ప్రజలకు కళ్ళు తుడిచే ప్రయత్నంలో భాగమేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందడానికి అవసరమైతే కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, సమాజాన్ని చీల్చి తమ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, తడక వినోద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply