Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADనేడు ఎన్‌టిఆర్‌ మెమోరియల్ బాడీ బిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్, మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్–2026...

నేడు ఎన్‌టిఆర్‌ మెమోరియల్ బాడీ బిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్, మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్–2026 పోటీలు

📰 Generate e-Paper Clip

నేడు ఎన్‌టిఆర్‌ మెమోరియల్ బాడీ బిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్, మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్–2026 పోటీలు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :    పెడదారి పడుతున్న నేటి యువతను సరైన మార్గంలో పెట్టాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు ( ఆదివారం ) మ‌ధ్యాహ్నం 3 గంటలకు టిడిపి నగర పార్టీ కార్యాలయంలో బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వ‌హించ‌నున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టిఆర్‌ పార్టీని స్థాపించిన నాటి నుంచే యువతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చారని, పార్టీ అధికారంలోకి రావడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, వారి స్పూర్తితోనే పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ఈ పోటీలను నిర్వహిస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకుడు నల్లెల్ల కిషోర్ తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడలోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో పోటీల‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా న‌ల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడారంగానికి, క్రీడాకారులకు ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహించిందని ఆయన గుర్తు చేశారు. నేటి రోజుల్లో యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి చెడుదారిలో పయనించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఈ మత్తు నుంచి యువతను దూరం చేసి, వారి ఆలోచనలను దేహదారుఢ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మళ్లించే లక్ష్యంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద‌ని తెలిపారు.

తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ( హైద‌రాబాద్ కోఠిలోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల ) సహకారంతో “ ఎన్టీఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్, మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ – 2026 ” పోటీలను నేడు న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియం పక్కనే గ‌ల తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించనున్నారని కిషోర్ తెలిపారు.. ఈ పోటీలను “ ఎన్టీఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ ( ఓపెన్ ) ”, “ నారా చంద్రబాబు నాయుడు మెన్స్ ఫిజిక్ ( ఓపెన్ ) ” పేర్లతో నిర్వహించనున్నారని వివ‌రించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టిఆర్‌, చంద్రబాబు నాయుడు లు ముఖ్యమంత్రులుగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకులు కావడంతో, వారి పేర్లతోనే ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోంద‌ని తెలిపారు. టైటిల్ విజేతలకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, మెమెంటోలను అందజేయడం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట‌ర్‌, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు తడక వినోద్ కుమార్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, శక్తి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page