టిపిఎస్‌కె, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈ నెల 31న కల్చరల్ నైట్
హైదరాబాద్, డిసెంబర్ 28, అద్దం న్యూస్ : మత్తు వద్దు బ్రో.. జీవితాలను చిత్తుచేస్తుందనే నినాదంతో టిపిఎస్‌కె, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న కల్చరల్ నైట్ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రం ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని టిపిఎస్‌కెలో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్, టిపిఎస్‌కె అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఈ నెల 31వ తేదీ సాయంత్రం 7 గంటలకు కల్చరల్ నైట్ కార్యక్రమంలో అనేక కళారూపాలతో ప్రదర్శనలుంటాయన్నారు. నూతన సంవత్సరం అనగానే యువతలో డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాడడం పరిపాటైందన్నారు. యువత, విద్యార్థులు మత్తుకు అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకుంటునే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మత్తు వద్దు బ్రో.. మత్తు వైపు కాదు పేరిట ఆటపాటల సృజనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మత్తుపై ఒక సాంస్కృతిక సమరమే చేయాలని అన్నారు. కవులు కళాకారులు మత్తుకు వ్యతిరేకంగా గళం ఎత్తుదాం ! సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కళాజాతాల ద్వారా యువతలో విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. అందుకు సాంస్కృతిక ప్రదర్శనలు మార్పునకు దోహదపడతాయన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు ఈ కల్చరల్ నైట్‌లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎల్ఏఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్, జిల్లా నాయకులు సునీల్, రాజయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply