తెలంగాణ సాధన ఉధ్యమ కారుడు అరూరి యాదగిరికు నివాళి
హైదరాబాద్, మే 10, అద్దం న్యూస్ : తెలంగాణ సాధన ఉద్యమ కారుడు అరూరి యాదగిరి దశదిన కర్మ శనివారం గాంధీనగర్ డివిజన్ వాల్మీకినగర్ బస్తీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై యాదగిరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ…. తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యాదగిరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఈ సందర్బంగా యాదగిరి కుటుంబ సభ్యులకు వినయ్ కుమార్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుక్క యాదగిరి, నరసింహ, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply