అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పి.సాయిబాబకు ఘనంగా నివాళులు
హైదరాబాద్, డిసెంబర్ 29, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పి.సాయిబాబా పార్థివ దేహాన్ని సోమవారం దోమలగూడలోని తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సందర్శనార్థం తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ సీఎం ఎన్‌టిఆర్ తనయుడు రామకృష్ణ బాబు, పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ లు హాజరై సాయిబాబా పార్థీవ దేహంపై తెలుగుదేశం పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా వేళ్లి సాయిబాబాను చివరిసారిగా దర్శించుకుని నివాళులర్పించారు. నివాళులు అర్పించడానికి వచ్చిన అన్ని పార్టీల ( బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ) నాయకులను జిల్లా నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాగు నగేష్ లు సాయిబాబా పార్థీవ దేహం వద్దకు తీసుకెళ్లారు.
నివాళులు అర్పించిన వారిలో క్రమశిక్షణ కమిటి సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, అజ్మీరా రాజు నాయక్, శ్రీపతి సతీష్, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు కాశీనాథ్, మాజీ వికలాంగుల చైర్మెన్ జి.కోటేశ్వర్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్. ఎంఆర్.పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఎం.ఎన్ శ్రీనివాస్, బిఎన్.రెడ్డి, జిగ్నేష్ జోషి, తెలుగుదేశం నాయకులు వల్లారపు శ్రీనివాస్, ఎబిఆర్ మోహన్, సుదర్శన్ రెడ్డి, కట్ట రాములు, వైఎల్.నర్సింహ గౌడ్, మగ్గి యాదగిరి, బానుప్రకాష్, కిరణ్, తడక వినోద్, అనిల్, కెడి దినేష్, చంద్రమోహన్, పద్మజ, జాన్సీ, ప్రమీల, శశిరేఖ, శ్యామ్ సుందర్, చిరంజీవి రాజు, జివి కృష్ణ, ఎంరాజు, పెద్దోజు రవీంద్రాచారి, భవాని శ్రీనివాస్, బివై శ్రీకాంత్, జగదీష్ గౌడ్, జోగిందర్ సింగ్, శక్తి ప్రేమ్, సుక్రవేది మరియు దివ్యాంగుల నాయకులు కొల్లి నాగేశ్వర్ రావు, రామ్ చందర్, శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం అంబర్‌పేట గోల్నాక స్మశాన వాటికకు తరలించి సాయిబాబా అంత్యక్రియలను నిర్వహించారు.















Leave a Reply