జర్నలిస్టులకు రెండు రకాల కార్డుల విధానాన్ని రద్దు చేయాలి
నేడు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతులు
» డీజేఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 26, అద్దం న్యూస్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ, పాత పద్ధతిలోనే డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ( టీజేఎఫ్టీ ) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నేటి ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని జిల్లా కమిటీలకు సూచించింది. ఈ మేరకు శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఎఫ్‌టి కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాదిని ఉపేందర్, ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ… జర్నలిస్టులకు రెండు రకాల కార్డుల విధానాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులను వేరు చేసేలా ఉన్న జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరారు. డెస్క్ జర్నలిస్టులకు ఎప్పటిలాగే అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అలాగే స్పోర్ట్స్, ఫీచర్స్, సినిమా, వెబ్, కల్చరల్, బిజినెస్ డెస్క్ జర్నలిస్టులతో పాటు కార్టూనిస్టులకు కూడా గతంలో మాదిరిగానే కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల పాల్గొనాలని కోరారు. సమావేశంలో టీజేఎఫ్టీ కోశాధికారి నిస్సార్, ఉపాధ్యక్షుడు కేవీ రాజారామ్, జాయింట్ సెక్రెటరీ విజయ తదితరులు పాల్గొన్నారు.![]()













Leave a Reply