Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadవాజపేయి సేవలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి – హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు...

వాజపేయి సేవలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి – హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి

📰 Generate e-Paper Clip

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : భారతదేశ రాజకీయాలలో అటల్ బిహారీ వాజపేయికి ఒక  ప్రత్యేకమైన స్థానం ఉందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి అన్నారు. బూత్ అధ్యక్షుడు బండారు  ప్రశాంత్ ఆధ్వర్యంలో వాజపేయి శత జయంతి ఉత్సవాల సమీక్ష సమావేశం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దీపక్ రెడ్డి, గౌతమ్‌రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి మాట్లాడుతూ..భారతదేశం కోసం వాజపేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వాజపేయి గురించి ప్రతి బూత్‌లో, ప్రతి డివిజన్‌లో కార్యక్రమాలను నిర్వహించి వాజపేయి గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని దీపక్‌రెడ్డి సూచించారు. బిజెపి సీనియర్ నేత గౌతమ్‌రావు మాట్లాడుతూ… సంకీర్ణ ప్రభుత్వాలను ఏ విధంగా నడిపించాలో నేర్పిన వ్యక్తి వాజపేయి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నేతలు నూనె బాలరాజు, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు, కృష్ణ గౌడ్, అజయ్, రాహుల్ చంద్ర, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్, ప్రవీణ్ రాఘవరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page