Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalహైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో ఘ‌నంగా వ‌సంత పంచ‌మి వేడుక‌లు

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో ఘ‌నంగా వ‌సంత పంచ‌మి వేడుక‌లు

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో ఘ‌నంగా వ‌సంత పంచ‌మి వేడుక‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 24, అద్దం న్యూస్ :   హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజ‌రై జ్ఞానదేవత సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేశారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… వసంత పంచమి విద్య, విజ్ఞానం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే పర్వదినమని, సమాజ అభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమన్నారు.

విద్యాభివృద్ధికి గ్రంథాలయాలు నిరంతరం సేవలు అందిస్తూనే ఉండాలని తెలిపారు. వసంత పంచమి ప్రాముఖ్యతను వివరించి, విద్యా, విజ్ఞానాలను విద్యార్థులు, యువత పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ శ్రేణి గ్రంథ పాలకురాలు చంద్రకళ, ప్రతిభారెడ్డి, ఉద్యోగులు అవినాష్, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, రామ్మోహన్, మహేందర్, పిడి.మహేష్, అనిల్, అశోక్, అవుట్ సోర్సింగ్ మహేశ్వరి, అమరావతి, భాగ్యలక్ష్మి, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page