...

విక్రమ్‌రావు మరణం జర్నలిస్టుల ఉద్యమానికి తీరని లోటు – సంతాపసభలో పలువురు వక్తలు

 హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :    జాతీయ జర్నలిస్టుల ఉద్యమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు దివంగత కోటంరాజు విక్రమ్‌రావు అకాల మరణం జర్నలిస్టుల ఉద్యమానికి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఐఎఫ్ డబ్ల్యూజే ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయగాన సభలో దివంగత విక్రమ్‌రావు సంతాపసభ జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, ఐఎఫ్‌డ‌బ్ల్యూజె కార్యదర్శి పులిపలుపుల ఆనందం, సీనియర్ పాత్రికేయుడు గౌరీశంకర్, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, బండి విజయ్ కుమార్, గుడిగె రఘు, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొని విక్రమ్‌రావు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఉద్యమానికి అంకితమై గత 60 సంవత్సరాలుగా పాత్రికేయ సమాజానికి సేవలందించిన మహోన్నతమైన వ్యక్తి విక్రమ్ రావు అని కొనియాడారు. తెలుగువాడైన విక్రమ్‌రావు జాతీయ అంతర్జాతీయ స్థాయి పాత్రికేయుడిగా ఎదిగిన గొప్ప నాయకుడని అన్నారు. జర్నలిస్టుల ఉద్యమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించారని వారు పేర్కొన్నారు. 1950లో ఢిల్లీలో ఏర్పడిన ఐఎఫ్ డబ్ల్యూజే వ్యవస్థాపకుల్లో విక్రమ్ రావు కీలకపాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు కె.పాండురంగారావు, పద్మనాభరావు, యర్రమిల్లి రామారావు, దామెర జగదీశ్వర్, తూము వెంకటరామకృష్ణ, జె.ఉదయ్ భాస్కర్ రెడ్డి,అశోక్ గౌడ్, పర్వతాలు, గడ్డమీది అశోక్ తదితరులు పాల్గొని విక్రమ రావుకు నివాళులర్పించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.