Home devotional శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ‌లో పాల్గొన్న వినయ్ కుమార్

శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ‌లో పాల్గొన్న వినయ్ కుమార్

0
1

శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ‌లో పాల్గొన్న వినయ్ కుమార్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్‌లోని వాల్మీకినగర్ బస్తీలో బిజెపి నాయకులు సుక్క యాదగిరి స్వామి, చిక్కడపల్లి వివేక్‌న‌గ‌ర్ బస్తీలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమాల‌కు ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు ( సోమవారం సాయంత్రం ) శ్రీనివాస గ్రౌండ్స్‌లో కార్పొరేట‌ర్ పావ‌ని ఆధ్వ‌ర్యంలో జ‌రుగ‌నున్న అయ్య‌ప్ప మ‌హాప‌డి పూజ‌కు స్వాములంద‌రూ రావాల‌ని విన‌య్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, నరసింహ, కుమార్ స్వామి, యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page