తెలుగుదేశం పార్టీ క్యాడర్ను చూసి నిద్రలో కూడా భయపడుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు
» సికింద్రాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నల్లెల్ల కిషోర్
హైదరాబాద్, ఆగస్టు 21, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీ క్యాడర్ను చూసి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నాయకులు నిద్రలో కూడా భయపడుతున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ టిడిపి పార్టీ నాయకుడు నల్లెల్ల కిషోర్ అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు రాత్రి నిద్రపోతున్నా టిడిపి.. టిడిపి అని కలవరిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ మరియు మాపార్టీ అధినేత చేస్తున్న వినూత్న అభివృద్ది విధానాలు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల బలమే వారికి గుర్తుకొస్తున్నాయని, టిడిపి క్యాడర్ను చూసి వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలకు తెలుగుదేశం పార్టీ ప్రస్తావన లేని రోజంటూ ఉండదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వరంగల్ జిల్లా వేదికగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, ‘పచ్చ కాంగ్రెస్’ ఆరోపణలు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టాయని, చివరికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చే పరిస్థితికి దారితీసిందని, తమ తమ సొంత పార్టీలోని కుమ్ములాటలకు తెలుగుదేశం పార్టీకి ముడిపెట్టడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.
గత పదేళ్లపాటు పాలించిన బిఆర్ఎస్ కానీ, ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడూ చిత్తశుద్ధితో ఆలోచించలేదని, ఇరుపార్టీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలు, ఐటీ విప్లవం, పేదల సంక్షేమ కార్యక్రమాలు నేటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి ఉన్నాయని, ఆ ప్రజాదరణను చూసే నేడు ఇరు పార్టీలు వణికిపోతున్నాయని వివరించారు. అంతర్గత వివాదాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, పరకాల స్థానం నుంచి పోటీ, టికెట్ల కేటాయింపుల్లో, అంతర్గత ఆధిపత్యపోరు కాంగ్రెస్లో నిప్పురాస్తుంటే, ఆ నెపాన్ని విపక్షాలపైకి, టిడిపిపైకి నెట్టేందుకు యత్నించడం సిగ్గుచేటని హితవు పలికారు. ఇప్పటికైనా అనవసర రాజకీయంగా బురద జల్లడం, టిడిపిపై ద్వేషం మానుకొని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పాలన అందించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్, తడక వినోద్, గుట్ట అనిల్ కురుమ, కరణం కిరణ్, ఇ.భాను ప్రకాష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply