వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
హైదరాబాద్, డిసెంబర్ 3, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేఖ, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్ ల పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో రెనోవేషన్ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ లెక్కింపులో 2 లక్షల 6189 రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో పాటు ఆన్‌లైన్ ద్వారా 12993 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో దేవనాధం తెలిపారు.![]()

![]()














Leave a Reply