హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి ఎం.దేవనాధం, పరిశీలకులు బి.సురేఖ ల పర్యవేక్షణలో భక్తులు ఈ హుండీని లెక్కించారు. లక్షా 75 వేల 462 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో దేవనాధం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, సభ్యులు మురికి గణేష్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply