Sunday, September 20, 2026
No menu items!
HomeHealth-TipsWalking: వట్టి నడకతో బరువు తగ్గడం సాధ్యమే!

Walking: వట్టి నడకతో బరువు తగ్గడం సాధ్యమే!

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మీ బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేయలేక సతమతమవుతుంటారు. అయితే కేవలం నడక (Walking) ద్వారానే ఒక కిలో కొవ్వును ఎలా కరిగించవచ్చో ప్రముఖ ఫ్యాట్ లాస్ నిపుణురాలు అంజలి సచన్ ఒక ఒక ‘సింపుల్ మ్యాథ్స్’ (Simple Math) ద్వారా వివరించారు.

ఆమె విశ్లేషణ ప్రకారం, శరీరంలో నిల్వ ఉన్న ఒక కిలో నిజమైన కొవ్వును (నీటి బరువు కాదు) కరిగించాలంటే సుమారు 7,700 కేలరీలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి 1,000 అడుగులు నడిస్తే (Walking) సుమారు 50 నుండి 70 కేలరీలు ఖర్చవుతాయి. ఈ లెక్కన ఒక కిలో కొవ్వును కరిగించడానికి సుమారు 1.5 లక్షల అడుగులు నడవాల్సి ఉంటుంది.

ఇది వినడానికి పెద్ద సంఖ్యలా అనిపించినా, ప్రణాళికతో సులభంగా సాధించవచ్చని అంజలి తెలిపారు. రోజుకు 10,000 నుండి 15,000 అడుగులు క్రమం తప్పకుండా నడిస్తే (Walking), కేవలం 10 నుండి 12 రోజుల్లోనే ఒక కిలో కొవ్వును కరిగించవచ్చు. ఇతర కఠినమైన వ్యాయామాల వల్ల ఆకలి పెరిగి ఎక్కువ తినే ప్రమాదం ఉంటుంది, కానీ నడక వల్ల అలాంటి సమస్య ఉండదని, ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుందని ఆమె పేర్కొన్నారు. బరువు తగ్గడానికి స్థిరత్వం (Consistency) ముఖ్యమని, నడక దీనికి అత్యంత అనుకూలమని ఆమె సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page