హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : డివిజన్‌లో నూతన స్ట్రీట్ లైట్స్, నూతన విద్యుత్ స్థంభాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు స్ట్రీట్ లైట్ల ప్రస్తావన పై లేవనె్తి స్ట్రీట్ లైట్ల కొరత పై చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. అనంతరం అధికారులు లైట్ల ఏర్పాట్ల పై ప్రత్యేక చర్యలు చేపట్టారని కార్పొరేటర్ పావని తెలిపారు. శనివారం డివిజన్‌లో నాలుగు నూతన ఐమాక్స్ లైట్లు, 10 నూతన స్ట్రీట్ లైట్ల స్థంభాల ఏర్పాటు పనులను కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పరిశీలించారు. డార్క్ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేసిన నూతన స్థంభాలను త్వరలో లైట్ల అమర్చి పనులు పూర్తి చేయాలని, స్ట్రీట్ లైట్స్ సిబ్బందికి కార్పొరేటర్ పావని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ఎ.వినయ్ కుమార్. డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, విఎస్‌టి.రాజు, ఎం.ఉమేష్, పాల శ్రీను, ఆకుల సురేందర్, నర్సింహ, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, ప్రశాంత్, నీరజ్, సంధ్యా రాణి, పూర్ణ, స్ట్రీట్ లైట్ సూపర్‌వైజర్లు బాలు నాయక్, రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply