ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

వీసీ తెచ్చిన నియంతృత్వ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

– పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు

హైదరాబాద్, అద్దం న్యూస్ : ఉస్మానియా యూనివ‌ర్శిటిలో వీసీ తెచ్చిన నియంతృత్వ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామ‌ని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనలను కట్టడి చేసేందుకు వర్శిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్టార్ తీసుకువచ్చిన నియంతృత్వ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని, యూనివర్శిటీలో ప్రశ్నించే హక్కు, నిరసనలు తెలిపే హక్కు కోసం గత కొన్ని రోజులుగా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగా గురువారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ బంద్ చేపట్టాయి. అనంతరం నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు అప్రజాస్వామికంగా ఆర్ట్స్ కళాశాలలోకి చొరబడి విద్యార్థి సంఘాల నాయకులను అక్రమ అరెస్టు చేశారు. ఈ చర్యను ఖండిస్తున్నామ‌ని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు తెలిపారు.

కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా పాలన అందిస్తామని ఊదరగొట్టి ఇప్పుడు ప్రజాస్వామిక, ప్రశ్నించే హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని విమ‌ర్శించారు. అరెస్ట్ చేసిన యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో పిడిఎస్‌యు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మంద నవీన్, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి, ఏఐఎస్ఎఫ్ ఓయు అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య, పిడిఎస్‌యు విజృంభన రాష్ట్ర కార్యదర్శి అల్లూరి విజయ్, పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కోట ఆనందరావు పిడిఎస్‌యు ఓయూ నాయకులు ఆసిఫ్, గౌతం తదితరులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page