గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించాం – తెలంగాణ సినిమా వేదిక

హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ :    గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించామ‌ని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) స్ప‌ష్టం చేసింది. గురువారం బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) గౌర‌వాధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్‌రాంరెడ్డి, రాష్ట్ర క‌న్వీన‌ర్ లారా, కో-క‌న్వీన‌ర్ మోహ‌న్ బైరాగి త‌దిత‌రులు మాట్లాడారు. గద్దర్ ఫిలిం అవార్డులను ఆంధ్ర సినిమాలకు ఇవ్వకూడదని హైకోర్టులో పిటిషన్ వేశామ‌ని, పిటీషన్ స్వీకరించిన కోర్టు రేపు వాదనను వినిపించబోతుందన్నారు. కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామ‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతున్న సినిమా రంగంలో ఆంధ్ర సినీ పెద్దల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుంద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి లు మిలాకత్ అయి తెలంగాణ సినిమా రంగాన్ని అన్యాయం చేస్తున్నారని విమ‌ర్శించారు. తెలంగాణ సినిమా రంగంలో పని చేస్తున్న వారితో జూరి కమిటీ నిర్వహించి అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర నాయ‌కులు జి.ర‌వి, చంద్ర‌న్న ప్ర‌సాద్‌, సాయి, కృష్ణ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page