Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadప్ర‌ధాన మంత్రి మోడి చేప‌డుతున్న సంక్షేమాన్ని పేద‌ల‌కు ల‌బ్ది చేరేలా చూడాలి – బిజెపి...

ప్ర‌ధాన మంత్రి మోడి చేప‌డుతున్న సంక్షేమాన్ని పేద‌ల‌కు ల‌బ్ది చేరేలా చూడాలి – బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 15, అద్దం న్యూస్ :   ప్ర‌ధాన మంత్రి మోడి చేప‌డుతున్న సంక్షేమాన్ని పేద‌ల‌కు ల‌బ్ది చేరేలా చూడాలని బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ అన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి 11 సంవ‌త్స‌రాలు పూర్తి చేసిన సంద‌ర్భంగా విక‌సిత్ భార‌త్ – సంక‌ల్ప సభ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయికుమార్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న వ‌డ్డెర బ‌స్తీ క‌మ్యూనిటీహాల్‌లో జ‌రిగింది. ఆదివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ హాజ‌రై మాట్లాడుతూ… ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేపడుతున్న కార్యక్రమాలన్ని పేదలకు లబ్ధి చేకూరుతున్నాయ‌న్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో ప్రపంచంలోనే భారత దేశం విశ్వ గురువుగా అవతరిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా బిజెపి విజయమని, ఇందుకు కనుగుణంగా కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని చెప్పారు. ఈ కారిక్రమంలో ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేశరామ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యురు శేషసాయి, రాష్ట్ర నాయకులు, నగర నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page