డివిజన్‌లోని ప్రతి బ‌స్తీని అభివృద్ధి చేస్తాం – గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

డివిజన్‌లోని ప్రతి బ‌స్తీని అభివృద్ధి చేస్తాం

– గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్


హైదరాబాద్, జులై 19, అద్దం న్యూస్ :   డివిజన్‌లోని ప్రతి బ‌స్తీని అభివృద్ధి చేస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ నేతాజిన‌గ‌ర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న‌ రోడ్డు సమస్యను పరిష్కరించి బస్తీలో నూతన సిసి రోడ్డు వేయించడంలో ప్రత్యేక చర్యలు తిసుకున్న గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌కు నేతాజీనగర్ బ‌స్తీవాసులు శనివారం కృతజ్ఞతలు తెలియచేస్తూ సన్మానించారు. ప్రతి సమస్యను కార్పొరేటర్ పావ‌ని దృష్టికి తీసుకువచ్చిన వెంటనే దాన్ని పర్శికరించే కార్పొరేటర్ పావ‌ని మా గాంధీనగర్‌లో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నామని బ‌స్తీవాసులు అన్నారు. డివిజన్‌లోని బస్తీలను అభివృద్ధి పరిచి సమస్యరహిత డివిజన్‌గా రూపొందించడానికి అనునిత్యం కృషి చేస్తానని కార్పొరేట‌ర్ పావ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నవీన్, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, హనుమంతు, ప్రశాంత్, బ‌స్తీవాసులు ఆనంద్ యాదవ్, యాదగిరి, కుమార్, నాగరాజు, రాజ్ కుమార్, శ్రీకాంత్ మంగమ్మ, సువర్ణ, రత్న, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page