
హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ : ఆర్టీసీలో బిసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని టిజిఎస్ ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి.సజ్జనార్ అన్నారు. టీజీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8 వ రాష్ట్ర మహా సభ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఆలేరు ఎమ్మెల్యే, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీర్ల ఐలయ్య హాజరయ్యారు. టీజీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇ.నిరంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసి సజ్జనార్ మాట్లాడుతూ… బిసి ఉద్యోగుల డిమాండ్లను, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. బిసి ఉద్యోగులలో ఉన్న క్రిమిలేయర్‌ను ఎత్తివేసేందుకు, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లల్లో రిజర్వేషన్ ను కల్పించే విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసి సంస్థ అభివృద్ధి కోసం బిసి ఉద్యోగులందరూ కష్టించి పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీలో కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ… ఆర్టీసీలో బిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎస్సీ, ఎస్టి అసోసియేషన్ కు ఇచ్చిన సర్క్యులర్ మాదిరిగానే బిసి ఉద్యోగులకు కూడా సర్క్యులర్ ఇవ్వాలన్నారు. మహాత్మా జ్యోతి బా పూలే జయంతి ఉత్సవాలకు బడ్జెట్ పెంచి ఆర్టీసి కళాభవన్‌లో నిర్వహించాలన్నారు. బిసి ఉద్యోగులతో ఉన్న క్రిమిలేయర్ ఎత్తివేయాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకానికి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం స్వాగతిస్తున్నామన్నారు.
మహాలక్ష్మీ పథకం వల్ల చిన్న చిన్న పొరపాట్లను సస్పెండ్ చేసిన ఉద్యోగులను తిరిగి అందరిని ఉద్యోగంలోకి తీసుకోవాలన్నారు. కార్మికుల పై పని భారం తగ్గించడానికి అన్ని కేటగిరిలలో సిబ్బందిని భర్తీ చేయాలని, కొత్త బస్‌లను ఆర్టీసీ వారే కొనుగోలు చేయాలన్నారు. 2013 బాండ్ డబ్బులు, 2017 పే స్కేల్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు. 2021, 2025 పే స్కేల్ చేసి ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఈ సభలో టీజీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.తిరుపతయ్య, టీజీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ చీఫ్ సలహాదారులు జిఎస్.చారి, ప్రధాన కార్యదర్శి ఎం.గోపికృష్ణ, రీజినల్ గౌరవ అధ్యక్షుడు ఠాగూర్ బాలాసింగ్, సంఘం వ్యవస్థాపకుడు, వర్కింగ్ ప్రసిడెంట్లు రమేష్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply