Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADమంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం

మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం

📰 Generate e-Paper Clip

మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్,  జూన్ 18, ( అద్దం న్యూస్ ) :  మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం బాపూజిన‌గ‌ర్‌ డివిజ‌న్ జాంభ‌వీన‌గ‌ర్‌లో రూ.1.80 ల‌క్ష‌ల‌తో, భోల‌క్‌పూర్ డివిజ‌న్ వెంక‌న్న ఫంక్షన్ హాల్ వీధిలో రూ.1.48 ల‌క్ష‌ల నిధుల‌తో మంచినీటి పైప్‌లైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు డివిజ‌న్ల‌ల్లో మంచినీటి స‌మ‌స్య‌లున్నాయ‌న్నారు. డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నా సంబంధిత అధికారులు ప‌ట్టించుకోవ‌డంలేద‌న్నారు.

ల‌క్ష‌లాధి రూపాయ‌ల‌ను వెచ్చించి మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్ల‌ను వేయించామ‌న్నారు. అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆ స‌మ‌స్య‌లున్నాయ‌న్నారు. వాటిని కూడా ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిల‌క‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం విష్ణువ‌ర్థ‌న్‌, శివ‌సాయి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్‌, రెబ్బ రామారావు, ఆకుల అరుణ్‌, జార్జ్‌, డేగ‌ల బిక్ష‌ప‌తి యాద‌వ్‌, ఎయిర్‌టెల్ రాజు, జావీద్ ఖాన్‌, వంగ‌ల న‌ర్సింగ్‌రావు, బ‌ల‌వంత్‌, బాష‌పాక శ్రీనివాస్‌, ప‌ట్నం న‌రేష్‌, న‌ర్సింగ్ ముదిరాజ్‌, శ్రావ‌ణ్‌, రాంరెడ్డి, బిజెపి నాయ‌కులు బిజ్జి క‌న‌కేష్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వైపి.రాజు, జ‌య కుమార్, సిపిఎం నాయ‌కురాలు ప‌ద్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page