సాయిబాబా కుటుంబానికి అండగా ఉంటాం
– ఏపి సీఎం చంద్రబాబు నాయుడు
హైదరాబాద్, జనవరి 4, అద్దం న్యూస్ : ఇటీవల మరణించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు అఖిల భారత ఎన్టిఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఏపి సీఎం, టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సాయిబాబ ఇంటికి ఆదివారం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు…విమానాశ్రయం నుంచి నేరుగా సాయిబాబా నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాయిబాబాతో తనకున్న సుధీర్ఘ అనుబంధాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. శ్రీరామునికి ఆంజనేయులు ఏ విధంగా సేవ చేశాడో అదే విధంగా నందమూరి తారక రామారావుకు సేవ చేశాడని చంద్రబాబు నాయుడు అన్నారు.

సాయిబాబా ఫ్యామిలీకి ముగ్గురు కుమారులు వంశీ, భార్గవ్ సాయి, సన్నీలకు వారికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు వెంట టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్ రావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ కుమార్, పెద్దోజు రవీంద్ర చారి, సీనియర్ నాయకుడు ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్, మ్యాడం రామేశ్వరరావు, నగర నాయకులు నల్లెల కిషోర్. బాలరాజ్ గౌడ్, నాగు నగేష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply