దళవాయి రమాదేవి కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినందుకు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు
– సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ టిడిపి అధ్యక్షుడు గండికోట విజయ్ కుమార్
సికింద్రాబాద్, ఆగస్టు 20, ( అద్దం న్యూస్ ) : మా వడ్డెర్ల సామాజిక వర్గం ముద్దుబిడ్డ అయిన అనంతపురానికి చెందిన ఒక సామాన్య కార్యకర్త అయిన దళవాయి రమాదేవి కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, విద్యాశాఖామంత్రి, యువనేత నారా లోకేష్ కు సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ టిడిపి అధ్యక్షుడు గండికోట విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయన్నారు. అందులో ఒక స్థానాన్ని గత ఎన్నికల సందర్బంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామి మేరకు దళవాయి రమాదేవికి, అలాగే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వర్ల రామయ్య కు కేటాయించారన్నారు. ఒక బిసి, ఎస్సీలకు కేటాయించడం ఏపి సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ లకే దక్కిందన్నారు. వెనుకబడిన వర్గాల వారికి సామాజికవర్గం న్యాయం చేయగల పార్టీ అది కేవలం తెలుగుదేశంపార్టీనే అని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ వెంటే నడుస్తూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.













Leave a Reply