వర్షాలకు ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే ఫ్యూచర్ సిటీ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబర్ 20, అద్దం న్యూస్ : “ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు.” విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ నగరంలో చినుకు పడితే అల్లకల్లోలమై జనజీవనం అస్తవ్యస్తమవుతుందని, ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా… దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఆడలేక మద్దెలా ఓడు అన్నచందంగా ప్రభుత్వం తన తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మొన్నటి వరకు మూసి సుందరీకరణ అంటూ కాల యాపన చేసారని, ఇప్పుడు దానికి తోడు కొత్తగా ఫ్యూచర్ సిటీ అంటూ ఊదర గొడుతున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమై సామాన్యుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతుంటే ఫ్యూచర్ సిటీ గొప్పగా కడతామంటూ ప్రభుత్వం మరో కొత్త మాట చెప్పి ప్రజల్ని వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఫ్యూచర్ సిటీ ఆంతర్యం ఏమిటంటే నగర శివారు ప్రాంతాలలోని భూములన్నిటినీ ఫ్యూచర్ సిటీ పేరు మీద కబ్జా చేసుకుని తమ బంధువులకు, అధికార పార్టీ అనునాయులకు కట్టబెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. దానిలో భాగమే ఈ ఫ్యూచర్ సిటీ అని సాయిబాబా అన్నారు. చినుకుబడితే నరకంలా తయారయ్యే హైదరాబాద్ నగరంలో 3, 4 రోజుల కిత్రం నాలాలో నలుగురు కొట్టుకుపోయిన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, సహచర మంత్రులు గానీ, పరామర్శించిన స్పందించిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. నాలాలో కొట్టుకుపోయిన నలుగురి మరణాలు… ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. ఇదే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు. 40, 50 గజాలు, గజాలున్న సామాన్యుడిపై ప్రతాపం చూపించే హైడ్రా అధికార పార్టీ నాయకులపై, వారి బంధువుల ఫాముహౌజులపై చర్యలు చేపట్టే దమ్ము లేక పేదలపై ప్రతాపం చూపుతోందని అన్నారు. హైదరాబాద్ ఉద్యోగులకు, అంగన్వాడి ఉద్యోగులకు, హోంగార్డులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. పరిపాలన అనుభవం లేక జరుగుతున్న వైఫల్యాలేనని సాయిబాబా అన్నారు. ఫ్యూచర్ సిటీ కేవలం మీ ఇలా కడుపులను నింపుకోవడానికి చేస్తున్నా కొత్త నాటకం మాత్రమేనని.. కొత్త దుకాణం అని అన్నారు. భవిష్యత్తులో యువతరానికి కనీసం గజం భూమి కూడా మిగల్చకుండా, అంగుళం భూమి కూడా లేకుండా ఉన్నవన్ని వేలం పాటల ద్వారా అమ్మి పబ్బం గడుపుకునే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. ఇటువంటి దిక్కుమాలిన చర్యలన్నీ వెంటనే మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply