...

బడాబాబుల ఆస్తుల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ల‌డం లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

బడాబాబుల ఆస్తుల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ల‌డం లేదు

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :    హైడ్రా పేరుతో కొత్త అలజడిని సృష్టించి, కోర్టులు మొట్టికాయలు వేసి వారించినా వినకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా పేదవాడి భూమిని నిర్దాక్షిణ్యంగా పేదవాడి ఇళ్లను కూల్చివేసే ప్రభుత్వం, ఎంతో మంది బడాబాబుల ఆస్తుల జోలికి వెళ్లడం లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ఎంతో మంది రాజకీయ నాయకులు, బడా బాబుల యొక్క విలాసమంతమైన కబ్జా నిర్మాణాల జోలికి వెళ్లకుండా కేవలం పేద ప్రజల ఇల్లు కూలగొడుతూ పేదవారి కన్నీటికి హైడ్రా కారణం అవుతుందన్నారు. పలుకుబడి ఉన్న నాయకులు చెరువుల్లో చెరువులో నిర్మాణాలు చేపట్టినా వారి జోలికి వెళ్లడం లేదు. చెరువులు కుంటలు కబ్జా యదేచ్చగా నిర్మించిన వాటికి జోలికి వెళ్లడం లేదు. వీరి పట్ల ప్రభుత్వం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుందని సాయిబాబా అన్నారు. కేవలం పేదవాడి పొట్టకొట్టడానికే హైడ్రా అవతరించిందా అని ప్రశ్నించారు. హైడ్రాకు ఒక ప్రత్యేకమైన పోలీస్‌స్టేష‌న్, ప్రత్యేక పోలీసు, అధికారులను ఇచ్చి పేద ప్రజలను వేధించుకు తినే ఒక వ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవం పోసిందని సాయిబాబా మండిప‌డ్డారు. ఈనాటికి హైడ్రా పేరు మీద ఎంతో మంది నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని విమ‌ర్శించారు. మీ ఇల్లు హైడ్రా పరిధిలో ఉంది కాబట్టి ఏ క్షణమైనా కూలగొట్టొచ్చని భయపెట్టి, ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వ‌జమెత్తారు. ఎంతో మంది పేదల వద్ద పైసలు దండుకుంటూ మీ కూల్చివేతలను గురికాకుండా మేము చూస్తామంటూ అవినీతికి తెరతీస్తున్నారని అన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే పేదవాడిని ఒక పథకం ప్రకారం పేద వారిని నాశనం చేయడానికి హైడ్రా కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోందన్నారు. రాజకీయ నాయకుల కబ్జాలను కాపాడటానికి హైడ్రా అవతరించిదని సాయిబాబా విమర్శించారు. హైడ్రా దుందుడుకు చర్యలను నిరసిస్తూ ఉన్నత న్యాయస్థానం మందలించినా, వారించినా వినకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నవారి ఇళ్ళను మాత్రం విడిచిపెడుతోందన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరైంది కాదన్నారు. కొన్ని 100 ఎకరాలు ఆక్రమించి ఫాంహౌజులు కట్టుకున్న వారి ఆక్రమణలను పట్టించుకోకుండా వదిలివేస్తుంద‌ని, కేవలం 50, 100 గజాలు ఉన్న పేదల ఇళ్లను ముందు నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తుందని ధ్వ‌జ‌మెత్తారు. అధికార పార్టీ నాయకులు, ఇతర రాజకీయ నాయకులు నిజంగా హైడ్రా పేరు సార్ధకత కలగాలని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి ఈ కూలగొట్టే ఇళ్లకు అనుమతులు ఎవరిచ్చారు అన్న అంశంతో పాటు హైడ్రాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.