Home Hyderabad హెచ్‌సియులో ఇంత గొడవ జరుగుతుంటే హైడ్రా నిద్ర పోతుందా –...

హెచ్‌సియులో ఇంత గొడవ జరుగుతుంటే హైడ్రా నిద్ర పోతుందా – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుదాకర్ డిమాండ్

0
15

 

హైదరాబాద్, అద్దం న్యూస్ : హెచ్‌సియులో ఇంత గొడవ జరుగుతుంటే హైడ్రా నిద్ర పోతుందా …? అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుదాకర్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. హెచ్‌సియు సమస్య పై అఖిలపక్ష పార్టీలతో, విద్యార్ధి సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా సెంట్రల్ యునివర్సిటీ కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు కబ్జా కు గురి అవుతుంటే రాష్ట్రంలో చెరువులు కాపాడుతానని ప్రతిజ్ఞ బూనిన హైడ్రా రంగనాద్ ఏం చేస్తున్నారని డాక్టర్ దిడ్డి సుదాకర్ ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన ఈ 400 ఎకరాలలో అడవితోపాటు 3 చెరువులు పీకాక్ లేక్, బఫెల్లో లేకే, క్రేన్ లేక్ లు ఉన్నాయని, అంటే ఈ నలుగు వందల ఎకరాలు బఫర్ జోన్‌లోకి వస్తాయని, అంగుళం స్తలం కూడా బఫర్ జోన్‌లో ఉంటే వదలం అని చెప్పే రంగనాద్ ఏం చేస్తున్నారని డాక్టర్ దిడ్డి సుదాకర్ అన్నారు. అనేక రకాల జంతువులకు, పక్షులకు నిలయమైన ఈ భూములపై ప్రభుత్వం బెషజాలకు పోకుండా తక్షణం, హెచ్‌సియు విద్యార్ధి సంఘాల నాయకులతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. కాంక్రీట్ నగరం గా మారిపోతున్న హైదరాబాద్ మహా నగరంలో ఆక్సిజన్ అందిస్తున్న పెద్ద పార్కును నష్ట పరచకుండా, ఇపుడు ప్రభుత్వం ప్రతిష్టాకరంగా ప్రకటించిన వేల ఎకరాలలో నిర్మించదలచిన ఫ్యూచర్ సిటీలో ఈ ఐటి హబ్ ని నిర్మించాలని కోరారు. ప్రభుత్వం కాదని హెచ్‌సియు భూములను ఆక్రమిస్తామని, నిర్మాణం చేస్తామని మొండి పట్టు పడితే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని డాక్టర్ దిడ్డి సుదాకర్ హెచ్చరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page