నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అమ్మ‌వారికి పూజ‌లు

నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అమ్మ‌వారికి పూజ‌లు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు హైద‌రాబాద్‌లో సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ 28 వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మండ‌పంలో అమ్మ‌వారికి తొలి రోజు సోమ‌వారం పూజ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని శ్రీ బాలా త్రిపుర‌సుంద‌రీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి క్రిష్ణ‌, వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌, ఎమ్మెల్సి ద‌యానంద్‌, త‌మ్మ‌న క్రిష్ణ‌మూర్తి, రాప‌ర్తి రాజ‌గోపాల్, మోటె కిర‌ణ్ కుమార్‌, పెండ్యాల చంద‌ర్‌, రాయ‌బార‌పు శ్రీనివాసులు, డి.చంద్ర‌మోహ‌న్ గౌడ్‌, పి.శివ‌క్రిష్ణ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు బాలా త్రిపుర‌సుంద‌రీ దేవి రూపంలో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. బాగ్‌లింగంప‌ల్లిలోని క‌ళ్యాణ ఆనంద పీఠాధ్య‌క్షులు, ఆత్మ‌బంధు డాక్ట‌ర్‌.పులిగ‌డ్డ హ‌నుమంత‌రాయ శ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హంస అవార్డు గ్ర‌హీత‌లు నాగ‌రాజు శ‌ర్మ‌, మ‌యూర అవార్డు గ్ర‌హీత సాయినాథ శ‌ర్మ లు అమ్మ‌వారికి పూజ‌లు నిర్వ‌హించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page