ఉధారత చాటుకున్న యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్
హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మందడి అరవింద్ కుమార్ యాదవ్ ( టిల్లు ) తన ఉధారతను చాటుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం సాయిచరణ్‌కాలనీలో ఉండే కార్యకర్త ధర్మరం శ్రీనివాస్ ఇటీవల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయాడు. దీంతో శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని తెలుసుకున్న అరవింద్ కుమార్ యాదవ్ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆపద ఉందంటే ఆదుకుంటామన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు అంజి యాదవ్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, సందోష్, తిరుమల్, కృష్ణ, బస్తీవాసులు గోపాల్, బాబు, శివ, బాలు, చిన్న తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply