...

‘యానిమల్’ చూశాను… మతిపోయింది: డీటెయిల్ గా రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘యానిమల్’ చిత్రం డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కథనంతో వచ్చిన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కాగా, ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. వివరణాత్మకంగా రివ్యూ ఇచ్చారు. “యానిమల్ చిత్రం చూశాను… మతిపోయిందంతే! సినీ మేధస్సుకు పరాకాష్ఠ ఈ చిత్రం. చిత్రబృందానికి అభినందనలు” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.ఈ సినిమాలో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది కూడా అల్లు అర్జున్ విశ్లేషించారు.

రణబీర్ కపూర్: భారతీయ నటనా ప్రతిభను రణబీర్ కపూర్ మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. రణబీర్ నటన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. రణబీర్ నువ్వు నటించిన విధానం చెప్పడానికి నా వద్ద మాటల్లేవు. నువ్వు నటనలో నెలకొల్పిన ప్రమాణాలకు ప్రగాఢ గౌరవం ప్రకటిస్తున్నారు.

రష్మిక మందన్న: అద్భుతంగా, ఆకర్షణీయంగా నటించింది. ప్రియమైన రష్మిక ఇప్పటివరకు నీ అత్యున్నత నటనా ప్రదర్శన ఇదే. నీ తదుపరి చిత్రాల్లోనూ మరెంతో నటనా ప్రతిభను ప్రదర్శిస్తావని నమ్ముతున్నాను.

బాబీ డియోల్: ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రభావశీల నటన చూస్తే మనం మాటలు మర్చిపోతాం. మీ బీభత్సకరమైన నటనతో ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకున్నారు.

అనిల్ కపూర్: ఈ సినిమాలో అనిల్ కపూర్ గారు తన పాత్రను ఎంతో సునాయాసంగా పోషించారు. అదే సమయంలో తన పాత్రలో ఎంతో తీవ్రతను చూపించారు. మీ అనుభవం విలువ ఏంటో చాటి చెప్పారు సర్.

తృప్తి దిమ్రి: ఈ పడుచు పిల్ల హృదయాలను బద్దలు కొట్టేసింది. తృప్తీ… నువ్వు ఇంకా మరెన్నో హృదయాలను బద్దలు కొడతావని అనిపిస్తోంది.

ఈ చిత్రంలో నటించిన నటులందరూ, ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ తమ అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి చెప్పాలి. జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంటే సరిపోతుంది. సందీప్… నువ్వు సినిమా పరిధులన్నింటినీ దాటేశావ్. సినిమాలో కనిపించిన తీవ్రత అసమానం. నువ్వు మరోసారి మా అందరినీ గర్వించేలా చేశావ్. భారతీయ సినీ ముఖ చిత్రాన్ని నువ్వు నీ సినిమాలతో ఎలా మార్చేస్తున్నావో, భవిష్యత్తులో ఇంకెలా మార్చబోతున్నావో స్పష్టంగా చూస్తున్నాను.

యానిమల్ చిత్రం భారతీయ సినీ క్లాసిక్స్ జాబితాలో చేరినట్టే అని భావిస్తున్నా అంటూ అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.