అంబర్పేట, ( అద్దం న్యూస్ ) :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్-బలయ్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు జీవన్ గౌడ్ ఆధ్వర్యంలో అంబర్పేట గౌడ సంఘంలో అలయ్-బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మా వెంకట్ రెడ్డి, డిపి.పద్మావతి రెడ్డి, అమృత, తొలుపునూరి కృష్ణ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా గత మూడు సంవత్సరాలుగా అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భోజన వసతి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, పులి జగన్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్, మహేందర్, చింతల కృష్ణ, కిషోర్ గౌడ్, సత్యనారాయణ, దిలీప్ కుమార్ నేత, మన్మోహన్ గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

![]()






