Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADగిన్నీస్ రికార్డు గ్ర‌హీత‌, తైక్వాండో క్రీడాకారుడు కొండా స‌హ‌దేవ్ కు అల‌య్‌-బ‌ల‌య్ పుర‌స్కారం

గిన్నీస్ రికార్డు గ్ర‌హీత‌, తైక్వాండో క్రీడాకారుడు కొండా స‌హ‌దేవ్ కు అల‌య్‌-బ‌ల‌య్ పుర‌స్కారం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) :       గిన్నీస్ రికార్డు గ్ర‌హీత‌, తైక్వాండో క్రీడాకారుడు కొండా స‌హ‌దేవ్ కు అల‌య్‌-బ‌ల‌య్ పుర‌స్కారం అంద‌చేశారు. అల‌య్‌-బ‌ల‌య్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల హైద‌రాబాద్ నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్‌లో జ‌రిగిన అల‌య్‌-బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో కొండా స‌హ‌దేవ్‌కు పురస్కారాన్ని అంద‌చేశారు. తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్రతాప్ శుక్లా, భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, అల‌య్‌-బ‌ల‌య్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ, కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వ‌న్నాల శ్రీరాములు హాజ‌రై కొండా స‌హ‌దేవ్‌కు పుర‌స్కారాన్ని అంద‌చేసి ఘ‌నంగా స‌త్క‌రించారు. అసాధార‌ణ ప్ర‌తిభ‌కు, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు, ప‌ట్టుద‌ల‌కు ప్ర‌తీక‌గా నిలిచిన అంతర్జాతీయ తైక్వాండో కోచ్ కొండా స‌హ‌దేవ్ ను అభినందించారు. అమెరికా నుంచి ఐద‌వ డాన్ బ్లాక్ బెల్ట్ పొందిన ఆయ‌న‌, అంత‌ర్జాతీయ మాస్ట‌ర్‌గా, రిఫ‌రీగా విశిష్ట గుర్తింపు పొందారని… 12 గిన్నీస్ రికార్డులు, 7 లిమ్కా రికార్డులు, 5 ఇండియా బుక్ రికార్డుద‌ల‌తో త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారని వ‌క్త‌లు పేర్కొన్నారు. ఎనిమిది సార్లు అంత‌ర్జాతీయ ఛాంపియ‌న్‌గా నిలిచి ఎన్నో ప‌త‌కాల‌ను సాధించారని.. అమెరికా అధ్య‌క్ష స్థాయి పుర‌స్కారాల‌ను కూడా అందుకున్నారన్నారు. బ్రూస్ లీ, స్వామి వివేకానంద‌ల స్ఫూర్తితో ముందుకు సాగుతూ… మ‌రిన్ని రికార్డులు సాధించాల‌నే ల‌క్ష్యంతో కృషి చేస్తున్న స‌హ‌దేవ్‌కు అభినంద‌న‌లను తెలియ‌చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page