Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADజనశక్తి రాష్ట్ర కమిటి సభ్యుడు కృష్ణారెడ్డి 34 వ వర్ధంతి

జనశక్తి రాష్ట్ర కమిటి సభ్యుడు కృష్ణారెడ్డి 34 వ వర్ధంతి

📰 Generate e-Paper Clip

జనశక్తి రాష్ట్ర కమిటి సభ్యుడు కృష్ణారెడ్డి 34 వ వర్ధంతి

హైద‌రాబాద్‌, జూన్ 6, ( అద్దం న్యూస్ ) :    ప్రతిఘటన పోరాట యోధుడు, సిపిఐ ( ఎం ఎల్ ) జనశక్తి రాష్ట్ర కమిటి సభ్యుడు కృష్ణారెడ్డి (శంకరన్న ) 34వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలో జరిగింది. శనివారం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి ని స్మరిస్తూ అరుణోదయ కళాకారులు విప్లవ గీతాలు పాడారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం మాట్లాడుతూ.. కృష్ణా రెడ్డి అమరుడై 34 ఏండ్లని… అయినా నేటికీ పిడిత ప్రజా పోరాటల్లో సదా చిరంజీవిగా ఉంటాడన్నారు. తను నమ్మిన ఆశయం కోసం చివరి శ్వాస వరకు నిబద్దతతో నిలిసినవాడని, అనేక మందిని విప్లవోద్యమంలో నిలిపిన కార్యశీలి అని కొనియాడారు. కృష్ణారెడ్డి గోదావరిలోయ ప్రజలకు మర్చిపోనీ జ్ఞాపకం అన్నారు.

భూపాలపల్లి, ములుగు, ఏటూరు నాగారం, ప్రాంతాల్లో అనేక పోరాటాల్లో ప్రజలను కదిలించి హక్కులు సాధించుకునేల దిశనిర్దేశం చేసిన గొప్ప నాయకుడన్నారు. కృష్ణారెడ్డి ఆశయలను కొన సాగిద్దామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. పీడిత ప్రజల విముక్తి పోరాటాలతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘంరాష్ట్ర అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు మల్సుర్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాకేష్, పిడిఎస్ యు ( విజృంభణ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్, నాయకులు గౌతమ్, అరుంధతి, అశ్విని, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page