Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADదళిత క్రైస్తవుల ఎస్సి హోదాపై ఈ నెల‌ 10 నుండి జిల్లాల సదస్సులు

దళిత క్రైస్తవుల ఎస్సి హోదాపై ఈ నెల‌ 10 నుండి జిల్లాల సదస్సులు

📰 Generate e-Paper Clip

దళిత క్రైస్తవుల ఎస్సి హోదాపై ఈ నెల‌ 10 నుండి జిల్లాల సదస్సులు
– కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎండి.అబ్బాస్, టి.స్కైలాబ్ బాబు

హైద‌రాబాద్‌, జూన్ 6, ( అద్దం న్యూస్ ) :    గత మర్చి 24 న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కోట్లాది మంది దళితులకు రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్లు దూరం చేసే విదంగా ఉందని, దానిని పున:సమీక్షించాలని కోరుతూ జూన్ 10నుండి అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహించునున్నట్లు అవాజ్, కేవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఎండి.అబ్బాస్, టి.స్కైలాబ్ బాబు లు తెలిపారు. శనివారం చిక్కడపల్లి కేవిపిఎస్ రాష్ట్ర కార్యాలయంలో కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సమావేశం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు లు మాట్లాడుతూ… కోట్లాది మంది దళిత క్రైస్తవులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పైన సుప్రీంకోర్టు తీర్పు ముప్పేట దాడి చేసిందన్నారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష అంటరానితనం పోవట్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పునర్ సమీక్షించాలని కోరుతూ ఈ నెల 10 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను, ప్రభుత్వ వైద్య శాలలను పీహెచ్‌సి కేంద్రాలలో సౌకర్యాలపై జూలై, ఆగస్టు నెలలో సమస్యలపై అధ్యయనాలు సదస్సులు, ధర్నాలు వంటి దశల వారి పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. 16 రకాల నిత్యవసర సరుకుల కోసం దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించిందని, ఈ నెల‌ 28 నుండి రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. ఇటీవల మరణించిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రకాష్ కరత్, పి.అశోక్, పి.పరశురాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు సురేష్, డి.రామ్మూర్తి, కోట గోపి, బోట్ల శేఖర్, మల్కయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మాణిక్యం రాజు, భగత్, బాలకిషన్, రత్నం, ప్రవీణ్, కృష్ణ, సుబ్బారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page