మద్యం దుకాణాల దరఖాస్తు రుసుములో 50 శాతం రాయితీ ఇవ్వాలి
– ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 6, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 2025-2027 మద్యం దుకాణాల ఏర్పాటులో భాగంగా గౌడ్, ఎస్సీలకు, ఎస్టీలకు ఖారారు చేసిన రిజర్వేషన్ల దుకాణాల దరఖాస్తు రుసుములో ఆయా వర్గాల వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్ కుమార్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ శాఖ కమిషనర్‌కు సిరిగిరి శ్యామ్ సోమవారం వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ….ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాల ఏర్పాటులో గౌడ కులస్తులకు15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే అన్నారు. రిజర్వేషన్లు ఉన్న దుకాణాలకు ఒకే దరఖాస్తు రుసుము… రిజర్వేషన్లు లేని దుకాణాలకు ఒకే దరఖాస్తు రుసుము పెట్టారన్నారు. ఇందువల్ల రిజర్వేషన్ ఉన్నవారికి సొంత వ్యాపారంలో అభివృద్ధి చెందాలనే వారు.. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు… బలహీన వర్గాలకు చెందిన వారు దరఖాస్తు రుసుము కట్టలేరన్నారు. కాబట్టి రిజర్వేషన్ మద్యం దుకాణాల వారికి దరఖాస్తు రుసుములో 50 శాతం రాయితీని ఇచ్చినట్టయితే రిజర్వేషన్ దుకాణాల వారికి ఎంతో మేలుజరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రిజర్వేషన్‌లో ఉన్న మద్యం దుకాణాలన్నింటికీ దరఖాస్తు రుసుములో 50 శాతం రాయితీ ఇచ్చే విధంగా చూడాలని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply