హైదరాబాద్, అద్దం న్యూస్ : అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 నుంచి 42 శాతానికి పెంచుతూ అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకం. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అని, రిజర్వేషన్లను అమలు చేయడానికి వెంటనే జీవో జారీ చేయాలి అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ విద్యానగర్లోని బిసి భవన్లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణికంఠ, ఓయు జెసి నాయకులు రాజు నేత, అధ్యక్షతన 26 బీసీ కుల సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… ఈ బిల్లు చట్టం చేయాలని, వెంటనే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయాలన్నారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని కోరారు. బీహార్లో, తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జీవోలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తర్వాత కొందరు కోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసిందని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు నీల వెంకటేష్, రాజేందర్, అనంతయ్య, మోదీ రామ్ దేవ్, భాస్కర్ ప్రజాపతి, రమాదేవి, రాఘవేందర్, యాదయ్య గౌడ్, నర్సింహా గౌడ్, నరేశ్, స్వామి గౌడ్, రవీందర్, కుమార్ యాదవ్, మల్లేశం, బాలయ్య, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply