హైదరాబాద్, నవంబర్ 18, అద్దం న్యూస్ : ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు రూ.1 లక్ష రూపాయల లంచం తీసుకుంటూ హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్ కాలువ కిరణ్, చైన్మెన్ మేకల భాస్కర్ లు ఏసీబీకి చిక్కారు. ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి 3 లక్షల రూపాయలను లంచం ఇవ్వాలని సర్వేయర్ కాలువ కిరణ్, చైన్మెన్ మేకల భాస్కర్ డిమాండ్ చేశారు. అందులో భాగంగా మొదటి విడతగా ఒక లక్ష రూపాయలను మంగళవారం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి ” టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి “. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలైన ” వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశాను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడుతుందని అధికారులు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
Leave a Reply