Accident: అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడింది. ఈ ఘటన చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డు మార్గంలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘాట్‌రోడ్డులోని మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి లోయలోకి పడిపోయిన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా బస్సు నుజ్జునుజ్జు అయింది.

ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు భయంతో, గాయాలతో హాహాకారాలు చేశారు. ఈ సమాచారం స్థానికులకు తెలియడంతో వారు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్థానిక ప్రజలు, పోలీసుల సహకారంతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. లోయలో ఉన్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంత మందికి తీవ్ర గాయాలైనట్లుగా ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు లోయలో పడటానికి గల కారణాలపై పూర్తి విచారణ జరుపుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page