సువిధా హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలి – హెచ్‌సిఎఫ్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 16, అద్దం న్యూస్ :    సువిధా హాస్పటల్ పై చర్యలు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ సిటిజ‌న్స్ ఫోరం (హెచ్‌సిఎఫ్ ) అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, కె.వీరయ్య, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరావులు లు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. రోగికి హాస్పిటల్స్ లో వైద్యం అనంతరం త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ లాంటి సౌకర్యాలను కల్పిస్తూ కొద్దిపాటి వైద్య సదుపాయాలతో రిహాబిలిటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయన్నారు. పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలోని సువిధ రిహాబిలిటేషన్ హాస్పిటల్ లో అరవిందా దేవి అనే పేషంట్ కు 16 రోజుల పాటు వైద్యం చేసి రోగాన్ని ముదరపెట్టి ఒక లక్షా అరవై వేల బిల్లు అదనంగా మెడిసిన్స్ పేరుతో మరో డెభై వేలు వసూలు చేసి ప్రాణాపాయ పరిస్థితులకు తెచ్చారన్నారు. 2 లక్షల ముప్పయి వేల రూపాయ‌లను ఖర్చు పెట్టినా పేషంట్ పరిస్థితి సీరియస్ స్థితికి చేరిందన్నారు. సదరు పేషంటును వేరే హాస్పటల్ కు తరలించగా వారి వైద్యాన్ని చూసి విస్తుపోయిన పరిస్థితి నెల‌కొంద‌న్నారు. ప్రస్తుతం సదరు పేషెంట్ ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నారని, దానికి పూర్తి బాధ్యత సువిధ హాస్పిటల్ యాజమాన్యమే వహించాలన్నారు. సువిధ హాస్పిటల్ లాంటి వారు డబ్బుల ఆశించి పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని రోగులను మభ్యపెడుతున్నారన్నారు. ఇలాంటి రిహాబిలిటేషన్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించాలని, సువిధ హాస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page