దేశ హితం కోసం హిందువులందరూ నడుం బిగించాలి – శ్రీ కృష్ణ పాద సేవ‌కుడు శ్రీ శ్రీ శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి

 దేశ హితం కోసం హిందువులందరూ నడుం బిగించాలి
– శ్రీ కృష్ణ పాద సేవ‌కుడు శ్రీ శ్రీ శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి

హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :  హిందువులందరూ దేశ హితం కోసం నడుం బిగించాలని శ్రీ కృష్ణ పాద సేవ‌కుడు, ప‌ర‌మ‌హంస ప‌రివ్రాజ‌క‌ శ్రీ శ్రీ శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ విద్యాన‌గ‌ర్‌ అచ్యుత్ రెడ్డి మార్క్‌లో హిందూ సమ్మేళనం శ‌నివారం రాత్రి జ‌రిగింది. ఈ స‌మ్మేళ‌నానికి సుమారు 700 మంది హిందూ సోదరీ, సోదరీమణుల మధ్యలో ఘనంగా వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా వందేమాతరం సామూహికంగా ఆలపించి.. తరువాత సుమారు 100 మంది యువతీ యువకుల మధ్యలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జయప్రదంగా ఆలపించారు. వేములవాణి ర‌మ‌ణ శిష్య బృందం చేత 27 మంది యువతులు కూచిపూడి నృత్య ప్రదర్శన సుమారు వైభవంగా జరిగింది. జై శ్రీరామ్ వందేమాతరం నినాదాలతో పై బహిరంగ సభ ఉత్సాహంగా జరిగింది. ఈ హిందూ సమ్మేళన బహిరంగ సభకు హిందూ సమ్మేళన ఉత్సవ సమితి కరుణాకర శర్మ అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ కృష్ణ పాద సేవ‌కుడు ప‌ర‌మ‌హంస ప‌రివ్రాజ‌క‌ శ్రీ శ్రీ శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఈనాటి ఇప్పటి సమాజంలో హిందూ ఐక్యత అవసరాన్ని విసిదీకరించారు. ఆర్ఎస్ఎస్ త్యాగాన్ని కొనియాడారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా ప్ర‌ముఖ జాతీయ వాది, చారిత్ర‌క ప‌రిశోధ‌కులు పి.మదన్ గుప్త, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ముదిగొండ ఉషా జ్యోతిర్మ‌యి మాట్లాడుతూ… హిందూ సమ్మేళనం అవసరాన్ని కొనియాడారు. హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ముఖ్య సలహాదారు.. రొయ్యూరు శేష సాయి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో నిర్వాహకులు ప్రముఖ న్యాయవాది రాజేష్ బాబు, కార్యదర్శులు కె.సంపత్ కృష్ణ, కె.శ్రీనాథ్, కె.వెంకటేష్ యాదవ్, కూరపాటి శ్రీనివాస్, రోషం బాలు త‌దిత‌రులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మ ఉపాధ్యక్షుడు రాళ్లబండి వెంకట రఘువీర్ అన్నదాన వితరణ సమర్పించారు. హిందూ స‌మ్మేళ‌న ఉత్స‌వ స‌మితి స‌ల‌హాదారులు వెంక‌టేశ్వ‌ర‌రావు, శ్రీనివాస్‌రావు, ముర‌ళీధ‌రుడు, వందలాదిగా హిందూ బంధువులు సోదరీ, సోదరీమణులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page