హ‌రిన‌గ‌ర్‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌రిశుభ్ర కార్య‌క్ర‌మం

హ‌రిన‌గ‌ర్‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌రిశుభ్ర కార్య‌క్ర‌మం

ముషీరాబాద్‌, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ :  డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా సోమ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్ బ‌స్తీలో ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌రిశుభ్ర కార్య‌క్ర‌మం జ‌రిగింది. అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల మ‌హంకాళి జిల్లా కో–కన్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్ గౌడ్ హాజ‌రై అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని శుభ్రం చేశారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… మంగ‌ళ‌వారం అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజేపి నాయ‌కులు తుడుం రాజు, జ‌నార్థ‌న్, క‌ల‌కోట అరుణ్‌, శ‌క్తి సింగ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page