న్యూఢిల్లీ, ( అద్దం న్యూస్ ) :
తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి ‘ చలో ఢిల్లీ ’ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు వారి సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకతను మోతె శోభన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొంటూ, వారికి సముచిత గౌరవం, గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం మరింత చొరవ చూపాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉద్యమకారుల సంక్షేమం, వారి హక్కులు, గౌరవప్రదమైన గుర్తింపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మోతె శోభన్ రెడ్డి తెలిపారు.![]()






