Tuesday, November 3, 2026
No menu items!
HomeGREATER HYDERABADగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలి – ఎలెక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డికి...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలి – ఎలెక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డికి టిఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత విజ్ఞ‌ప్తి

📰 Generate e-Paper Clip

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేర‌కు సోమ‌వారం బీఆర్ కేఆర్ భవన్‌లో ఎలెక్టోరల్ ఆఫీసర్ ( సీఈవో ) సుదర్శన్ రెడ్డితో క‌విత‌ సమావేశమై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని కోరుతూ విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని మూడింటా రెండు వంతుల ప్రాంతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎన్నికల వాతావారణం నెలకొని ఉందన్నారు. గ్రాడ్యుయేట్లు అందరూ ఎంతో ఆలోచన చేసి ఓట్లు వేసేవాళ్లు అని…మా లాంటి కొత్త పార్టీలకు ఎజెండా చెప్పుకునేందుకు ఇదొక అవకాశం అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఈ నెల 6 వరకు ఉందని చెబుతున్నారని…ఎస్ఐఆర్ ప్రక్రియనే ఈ నెల 21 వరకు ఉన్నందున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ ను కూడా పొడగించాలని ఈసీని కోరామ‌న్నారు. తెలంగాణ రక్షణ సేన రిజిస్ట్రేషన్ పనులు ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఢిల్లీలో మా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర సీఈవో తరఫున నివేదిక ఇవ్వాలని కూడా సీఈవో ను కోరామ‌ని, ప్రధాన స్రవంతి పార్టీలకు పోటీగా మేము చేస్తున్న ప్రయత్నాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశామ‌ని క‌విత తెలిపారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రతిసారీ రీ రిజిస్ట్రేషన్ అనేది ఇబ్బందిగా మారిందని, దీని కారణంగా అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతోందన్నారు. పెద్ద పెద్ద విద్యా సంస్థల వాళ్లు పోటీ చేస్తూ వారి విద్యార్థుల ద్వారా ఎన్నికలను బయాస్డ్ గా మారుస్తున్నారని, ఈ విషయాన్ని ఎన్నికల తర్వాత ఈసీ దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. నామినేషన్లు అయ్యే వరకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని విజ్ఞప్తి చేశామని, దానికి సీఈసీ సానుకూలంగా స్పందించారన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page