Arjun Tendulkar: సచిన్ కొడుకు పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Arjun Tendulkar: సచిన్ కొడుకు పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన ప్రియురాలు, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి మార్చి 5న జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గతేడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 3 నుంచి ముంబైలో పెళ్లి వేడుకుల ప్రారంభం అవుతాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పెళ్లి వార్తలను సచిన్ కుటుంబం ధ్రువీకరించాల్సి ఉంది. ఇటీవలే అర్జున్ నిశ్చితార్థాన్ని సచిన్ టెండూల్కర్ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.

సానియా చందోక్.. అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్‌కు క్లోజ్ ఫ్రెండ్. సారా ద్వారానే సానియా అర్జున్‌కు పరిచమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వివాహం జరిపించేందుకు సిద్దమయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన సానియా.. ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన ‘మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ’కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దుతోంది. ముంబైకి చెందిన సెలెబ్రిటీలు సానియాకు కస్టమర్లు. సారా టెండూల్కర్, సానియా మంచి స్నేహితులు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page