ఘనంగా అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ 62 వ వార్షికోత్సవం

హైదరాబాద్, సెప్టెంబర్ 13, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 62 వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన కల్చరల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై హైదరాబాద్ ఐ హాస్పిటల్ వైద్యులు డాక్టర్.వెంకటాచలం, ఎస్బిఐ అశోక్‌నగర్ శాఖ చీఫ్ మేనేజర్ సంతాజీ కందుగుల తో కలిసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరిలో అలనాటి మధుర గానాలతో అతిథులను అలరించారు. అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులను సన్మానించారు. అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బి.సూర్యప్రకాష్, ఉపాధ్యక్షుడు వై ఆర్.రెడ్డి, కార్యదర్శి డాక్టర్.అంజి బాబు, జాయింట్ సెక్రటరీ జి.పద్మావతి, కోశాధికారి శివన్నాయుడు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply