...

బ్రెయిన్ స్ట్రోక్‌తో బెల్లం సుధాక‌ర్ మృతి – కొడుకు అవయవాలను దానం చేసిన తల్లీ బెల్లం సరోజ

బ్రెయిన్ స్ట్రోక్‌తో బెల్లం సుధాక‌ర్ మృతి

  • మాన‌వ‌త్వాన్ని చాటుకున్న త‌ల్లి
  • కొడుకు అవయవాలను దానం చేసిన తల్లీ బెల్లం సరోజ
హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : చనిపోయిన వ్యక్తుల అవయవ దానాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కొత్త జీవనం పొందుతున్నారు. ఆధునిక సమాజంలో అవయవదాన అవసరాన్ని వివిధ మాధ్యమాల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా తెలుసుకుంటున్న ఎంతోమంది తమ కుటుంబ సభ్యుల అవయవాలను దానం చేస్తుండడం ఎంతో గొప్ప విషయంగా చెప్పవచ్చు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంనగర్‌కు చెందిన 40 ఏళ్ల బెల్లం సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డంతో హైదర్‌గూడ‌లోని అపోలో హాస్పిటకు త‌ర‌లించారు. గురువారం సుధాక‌ర్ మృతి చెందాడు. అయితే త‌న కొడుకు భౌతికంగా లేక‌పోయినా ఇత‌రుల రూపంలో బ‌తికే ఉండాల‌ని మృతుడి సుధాక‌ర్ త‌ల్లి బెల్లం స‌రోజ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. అతని అవయవాలను తల్లి బెల్లం సరోజ మ‌రొక‌రి దానం చేశారు. మృతి చెంది కూడా మ‌రొక‌రి తన కొడుకు అవయవ దానంతో ఉపయోగపడుతూ ఆ రూపంలో త‌న కొడుకు సజీవుడు గానే ఉండాలని గొప్ప ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తల్లి బెల్లం సరోజ తెలియజేశారు. శుక్ర‌వారం సుధాక‌ర్ అవ‌య‌వాల‌ను అప్ప‌గించారు. శ‌నివారం అడిక్‌మెట్ ల‌లితాన‌గ‌ర్ స్మ‌శాన‌వాటిక‌లో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు మృతుడి స్నేహితులు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.